![]() |
![]() |
.webp)
సండే ఎలిమినేషన్ డే అంటూ నాగార్జున వచ్చేసాడు. వచ్చి రాగానే ఎపిసోడ్లో మొదట గీతుతో మాట్లాడాడు. "నువ్వు రోజు పాటకి డ్యాన్స్ చేయడం అయ్యిపోయాక ఒకటి అనుకుంటావ్? ఏంటది?" అని నాగార్జున అడుగగా, "ఈ సారి ఫీమెల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నా" అని గీతు అంది. ఆ తర్వాత స్నేక్, లాడర్ టాస్క్ ఇచ్చాడు. ఏ కంటెస్టెంట్ స్నేక్? ఏ కంటెస్టెంట్ లాడర్ ? అని చెప్పమనగా, ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ తర్వాత నామినేషన్లో చివరగా శ్రీసత్య, గీతు ఉండగా గీతు ఎలిమినేట్ అయింది.
"ఎవరు మాట్లాడమాకండి. నేను వెళ్ళి నా ఫేవరేట్ ప్లేస్ లో కూర్చొని వెళ్ళిపోతా" అని చెప్పి, గీతు తన ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఏడ్చేసరికి వాళ్ళని చూసి తను కూడా ఏడ్చేసింది. రేవంత్ గట్టిగా హత్తుకొని కాసేపు ఏడ్చాడు. "నా జీవితాంతం నీకు ఋణపడిపడిపోతాను బిగ్ బాస్. ఐ లవ్ యూ బిగ్ బాస్. నాకు చాలా నేర్పించావ్ బిగ్ బాస్" అని ఏడ్చేసింది గీతు. ఆ తర్వాత "ఎప్పుడు అయిన, ఎవ్వరినైనా బాధపెట్టుంటే సారీ" అని హౌస్ మేట్స్ తో చెప్పుకుంటు ఏడ్చేసింది. "నేను వెళ్ళను. గేట్లు మూయద్దు బిగ్ బాస్. ఐ రియల్లీ మిస్ యూ బిగ్ బాస్" అని తను ఏడ్చేసింది.
తను హౌస్ నుండి వెళ్ళాక రేవంత్, ఆదిరెడ్డితో మట్లాడుకుంటూ ఏడ్చాడు."షీ డిజర్వింగ్ బెటర్" అని శ్రీసత్య అనగా, గీతు సీక్రెట్ రూం కి వెళుతుంది అని రేవంత్ చెప్పాడు. స్టేజ్ మీదకి వచ్చిన గీతుకి, నాగార్జున తన 'AV' ని చూపాడు. అది చూసి నాగార్జున , "గీతు దట్ ఈజ్ ఫ్యాబులస్ జర్నీ " అని అనగా, కన్నీళ్ళు పెట్టుకుంది గీతు. "ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ రూల్ చేద్దామనుకున్నా సర్" అని అంది. ఆ తర్వాత "ఒక గేమర్ లా గేమ్ ఆడావ్. కానీ ఆడియన్స్ కి ఒక లోటు కనపడింది. మరి వాళ్ళు ఏం చూసారో తెలియదు" అని నాగార్జున చెప్పుకొచ్చాడు.
అయితే గీతు ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ అందరిని షాక్ కి గురిచేసింది. ది బెస్ట్ పర్ఫామర్, ద గేమ్ చేంజర్ ఇలా ఎలా ఎలిమినేట్ అవుతుంది అని హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. కానీ అంచనాలకు మించి ఎలిమినేషన్ జరగడమే బాస్ షో అని కొందరు కామెంట్స్ చేస్తోన్నారు. అయితే బిగ్ బాస్ లో ఇక స్ట్రాటజీస్, గేమ్ ప్లాన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
![]() |
![]() |